సుందరీ సుబ్బారావుల మధ్య మాటా మాటా పెరిగింది. నిన్ను పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను అని సుబ్బారావు అంటే నేను చేసిన తప్పును కూడ నాకు వదలిపెట్టారా అంటూ సుందరి నిలదీసింది. మన పెళ్ళి జరిగేటప్పుడు మీ వాళ్లు మా వాళ్లకు సరిగా మర్యాదలు చేయలేదని సుబ్బారావు అంటే, మర్యాదలు అందుకునే స్థాయిలో మీ వాళ్లు ప్రవర్తించలేదని సుందరి చెప్పింది. ఇలా కాదనుకున్నాడు సుబ్బారావు. సుందరి గడ్డం పుచ్చుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు.
సుబ్బారావు : ఎందుకు సుందరీ నన్ను అపార్థం చేసుకుంటావు... అసలు మా అత్తగారి కన్నా మిన్నగా మీ అత్తగారి ని నేను దైవసమానురాలిగా చూసుకుంటున్న సంగతిని నువ్వు మరిచిపోతే ఎలా?
సుందరి : ఆ...