"ఏమోయ్... మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చిందేంటి...?" ప్రశ్నించాడు లెక్చరర్
"అవును సార్...! 'శ్రద్ధ'గా గుడికెళ్తే 'శాంతి' దొరుకుతుంది. మంచి 'భావన'తో 'పూజ', 'ఆరతి', 'అర్చన', 'ఆరాధన' చేయించి దేవుడి ముందు 'జ్యోతి' వెలిగిస్తే 'తృప్తి', 'ముక్తి' లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్...?" జవాబిచ్చాడో కొంటె విద్యార్థి.