గ్రీటింగ్స్ అమ్మే షాపులోకి వెళ్లిన గిరిజ అద్భుతమైన లవ్ గ్రీటింగ్స్ ఉన్నాయా అంటూ సేల్స్‌మెన్‌ను అడిగింది.
నా జీవితంలో నేను ప్రేమించిన ఒకే ఒక మగాడివి నీవే... నా ప్రేమ నీకే సొంతం... లాంటి వాక్యాలు రాసిన కొత్త రకం కార్డులున్నాయి ఇమ్మంటారా అంటూ గిరిజను అడిగాడు సేల్స్‌మెన్.
అంత అద్భుతమైన వాక్యాలున్న కార్డులు ఉన్నాయా అయితే ఓ పదివ్వండి అంటూ ఆనందంతో అడిగింది గిరిజ.