ఓ ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు
తాగినపుడు నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా డార్లింగ్ అంటూ తన ప్రేయసితో అన్నాడు ప్రేమికుడు.
కానీ నేను తాగను కదా అంటూ ఆశ్చర్యంతో తన ప్రియున్ని ప్రశ్నించింది ప్రేయసి.
నువ్వు తాగినపుడు కాదు డియర్ నేను తాగినపుడు నాకు నువ్వు అందంగా కన్పిస్తావు అంటూ అసలు విషయం చెప్పాడా ప్రియుడు.