సుబ్బారావు ఒక రోజు ఆకుపచ్చని సూట్ తొడుక్కుని దానిపై ఎరుపు రంగు టైను కట్టుకుని తన ప్రియురాలైన సుందరి దగ్గరకు వెళ్ళాడు. సుబ్బారావు వేసుకున్న డ్రస్‌ను కొంచెం కూడా పట్టించుకోకుండా వేరే సంగతులు మాట్లాడటంలో మునిగిపోయింది సుందరి. రకరకాల భంగిమల్లో తన వస్త్రాలలో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ఎన్నో పాట్లు పడటం మొదలుపెట్టాడు సుబ్బారావు. చివరికి ఆగలేక అడిగాడు
సుబ్బారావు : సుందరీ నా సూట్ ఏ రంగులో ఉంది?
సుందరి : ఆకుపచ్చ
సుబ్బారావు : నా టై ఏ రంగులో ఉంది?
సుందరి : ఎరుపు రంగు
సుబ్బారావు : మరి ఈ రెండూ తొడుక్కున్న నేను ఎలా ఉన్నాను సుందరీ!
సుందరి : అచ్చం రామచిలుకలా ఉన్నావు సుబ్బూ