ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాధా ఏంటే దిగులుగా ఉన్నావ్ అంటూ అడిగింది గీత.
నిన్న నేను, నా బాయ్ ఫ్రెండ్ కలిసి పార్క్‌కు వెళ్లినప్పుడు మా నాన్న మమ్మల్ని చూసాడే అంది రాధ.
ఇంటికొచ్చాక మీ నాన్న నిన్నేమైన కోప్పడ్డాడా అంటూ అడిగింది గీత.
లేదే... నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో మాట్లాడి మా ఇద్దరికీ పెళ్లి చేసేస్తానని అన్నాడే అందుకే దిగులుగా ఉంది అంటూ అసలు విషయం చెప్పింది రాధ.