Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ ఎన్నికల బరిలో రాధికా శరత్ కుమార్.. బీజేపీ నుంచి పోటీ!

radhika sarathkumar

ఠాగూర్

, శుక్రవారం, 22 మార్చి 2024 (15:32 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆమెకు భారతీయ జనతా పార్టీ టిక్కెట్ కేటాయించారు. విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో 14 స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఓ లోక్‌సభ స్థానానికి బీజేపీ అధిష్టానం శుక్రవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో రాధికా శరత్ కుమార్‌ను విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించింది. కాగా, ఆమె భ ర్త, సినీ నటుడు శరత్ కుమార్ తన సారథ్యంలోని అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి పార్టీని ఇటీవల బీజేపీలో విలీనం చేసిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిఫలంగా ఆయన భార్య రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ ఎంపీ సీటును కేటాయించింది. అలాగే, పుదుచ్చేరి బరి నుంచి, ఆ రాష్ట్ర హోం మంత్రి నమశ్శివాయంకు సీటు కేటాయించింది. కాగా, గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితా, 9 మందితో మూడో జాబితాను భాజపా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 291 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
 
తమిళనాడు అభ్యర్థుల జాబితా ఇదే..
తిరువళ్లూరు - పొన్‌. వి. బాలగణపతి
చెన్నై నార్త్‌ - ఆర్‌.సి. పాల్‌ కనగరాజ్‌
తిరువన్నామలై - ఎ. అశ్వత్థామన్‌
నమక్కల్‌ - కె.పి. రామలింగం
తిరుప్పూర్‌- ఎ.పి. మురుగనందం
పొల్లాచ్చి - కె. వసంతరాజన్‌
కరూర్‌ - వి.వి. సెంథిల్‌నాథన్‌
చిదంబరం - పి. కాత్యాయని
నాగపట్టిణం - ఎస్‌జీఎం రమేశ్‌
తంజావూరు - ఎం. మురుగనందం
శివలింగ - దేవనాథన్‌ యాదవ్‌
మదురై - రామ శ్రీనివాసన్‌
విరుదునగర్‌ - రాధికా శరత్‌ కుమార్‌
తెన్‌కాశీ - జాన్‌ పాండియన్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివో నుంచి వివో టీ3 5జీ.. ఫీచర్స్ ఇవే..