Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బటన్ నొక్కపోయే సమయానికి ఈవీఎం చెడిపోతే ఏమవుతుంది?

dummy evms

వరుణ్

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (08:40 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమరం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే మూడు దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీ శుక్రవారం తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ నాలుగో దశ పోలింగ్ మే నెల 13వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే, నాలుగో దశలో పోటీ చేసే అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సివుంది. ఇదిలావుంటే, ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈవీఎం బటన్ నొక్కే సమయంలో ఈవీఎం మొరాయిస్తే ఏం చేయాలన్న ఏమవుతుందో తెలుసుకుంటే..
 
సాధారణంగా కొన్ని ఈవీఎంలు ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా మొరాయిస్తుంటాయి. అదే జరిగితే ఏం జరుగుతుంది. దానిలో ఓట్లను నమోదు చేసే పరిస్థితి లేకుంటే ఏమవుతుంది? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఒకవేళ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లలో ఏ ఒక్కటి టెక్నికల్‌గా పనిచేయకున్నా గాబరా పడాల్సిన పనిలేదు. అప్పటివరకు ఓటర్లు వేసిన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్‌లోని మెమొరీలో సేవ్ అయి (నిక్షిప్తం) ఉంటాయి. ఒకవేళ ఆ సమాచారం కూడా దొరకని పరిస్థితి ఎదురైతే వీవీ ప్యాట్ యంత్రం నుంచి వచ్చిన స్లిప్పులు ఎలాగూ ఉంటాయి.
 
పోలింగ్ స్టేషనులో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌ల్లో ఏ ఒక్కటి మొరాయించినా వెంటనే కొత్తగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్‌ల సెట్‌ను అక్కడికి పంపిస్తారు. జోనల్ మెజిస్ట్రేట్లు, ఏరియా మెజిస్ట్రేట్ల పరిధిలో రిజర్వులో ఉండే ఎన్నికల సామగ్రి నుంచి వీటిని కేటాయిస్తారు. 
 
ఇటువంటి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున అన్ని ఈవీఎంలలో నమోదైన ఓట్లను కౌంట్ చేస్తారు. ఏదైనా సాంకేతిక కారణంతో కంట్రోల్ యూనిట్‌లోని ఓట్లు డిస్‌ప్లే కాకపోతే ఫలితాన్ని పొందడానికి సంబంధిత కంట్రోల్ యూనిట్‌కు చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఒకవేళ వీవీ ప్యాట్ యంత్రం ఒక్కటే మొరాయిస్తే దాని స్థానంలో మరో కొత్త వీవీ ప్యాట్ యంత్రాన్ని రీప్లేస్ చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ - మే 13న పోలింగ్