జయేంద్ర సరస్వతి దగ్గరుండి ఆంధ్ర సీఎం చంద్రబాబుతో కృష్ణా పుష్కర స్నానం...(ఫోటోలు)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయన సమక్షంలో విజయవాడలో కృష్ణా పుష్కర సంరంభాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దుర్గా ఘాట్ వద్ద్ పూజా కార్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయన సమక్షంలో విజయవాడలో కృష్ణా పుష్కర సంరంభాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దుర్గా ఘాట్ వద్ద్ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కంచికామకోటి జయేంద్ర సరస్వతి నారా చంద్రబాబు కుటుంబ సభ్యులతో పుణ్య స్నానాలు ఆచరింపజేశారు. ఆయనే దగ్గరుండి సీఎం దంపతులతో పుష్కర పూజలు చేయించారు.
కృష్ణా నది పుష్కర శోభను సంతరించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా అనుసంధానం ఈ పుష్కరాల్లో ఒక కీలక పరిణామన్నారు. దేశంలోని అన్ని నదులనూ అనుసంధానించాలని ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నెండు రోజుల పుష్కరాలు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం తెలిపారు.