Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్మార్గమైన పనిచేస్తే.. కొన్నాళ్ళకది...?

Advertiesment
kids
, బుధవారం, 30 జనవరి 2019 (18:11 IST)
చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై
బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్
దాసినరాగి గానబడదా జనులెల్ల నెఱుంగ భాస్కరా...
 
రాగిపై బంగారం ఒక పొరగా ఏర్పరచి దానివంతను బంగారమని చెప్పినను కాలక్రమమున, ఆ పూయబడిన బంగారం తొలగిపోగానే ప్రజలందరును అది రాగి యని తెలియుదురు. అట్లే నీచుడొక దుర్మార్గమైన పనిచేసి దానిని యెవరికినీ చెప్పక, రహస్యముగా దాచియుంచినను కొన్నాళ్ళకది బయలుపడక మానదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాగుల జావ తీసుకుంటే ఆ శక్తి వస్తుంది..