Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ఉదయిస్తాడా? అలారం ఎందుకు..?

అనగనగా ఒక చెట్టు. పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో ఎంతో అందంగా ఉండేది. దారినపోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ చెట్టుకింద నిలబడి ఎంతోమంది విశ్రాంతి తీసుకునేవారు.

Advertiesment
Duty
, గురువారం, 30 నవంబరు 2017 (14:46 IST)
అనగనగా ఒక చెట్టు. పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో ఎంతో అందంగా ఉండేది. దారినపోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ చెట్టుకింద నిలబడి ఎంతోమంది విశ్రాంతి తీసుకునేవారు. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైనసరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తేచాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది.
 
అలా కొన్నాళ్ళు గడిచాక ఆ చెట్టు ఎండిపోయి పచ్చదనం కోల్పోయింది. ఎండకు కొమ్మలు ఎండిపోయాయి. ఆకులు రాలిపోయాయి. దీంతో ఆ చెట్టు బోసిపోయింది. అటుగా వెళ్తున్న వాళ్లందరూ చెట్టువద్ద నిలబడి జాలిగా చూసి వెళ్లేవారు. ఇక దీని ఆయుష్షు అయిపోయిందని అనుకుంటూ వెళ్ళిపోయేవారు. 
 
వారి మాటలు వింటూ ఆ చెట్టు మాత్రం నిరుత్సాహపడలేదు. తనకు మళ్ళీ గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో జీవించసాగింది. కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే చెట్టులో చలనం మొదలైంది. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి. కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి. పువ్వులు వికసించాయి. మళ్ళీ పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది. వాళ్ళకు జీవితం మీద ఆశను కలిగేలా చేసిందాచెట్టు.! 
 
మనిషి జీవితమూ అంతే. ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు ముఖంపై మాయమౌతాయి. కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకుల్లా వీడిపోతారు. అయిన సరే నిరుత్సాహపడకూడదు. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్ధాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగామారుతుంది అని గట్టిగా నమ్ము... అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం. గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోకచిలుకగా మారలేదు అన్న నిజం గ్రహించాలి. కాలం పెట్టిన సహన పరీక్షలో నువ్వే నెగ్గాలి.
 
ఎందుకంటే మంచి విషయాలు అంతతేలికగా పూర్తికావు.. అర్థంకావు కూడా. అందువల్ల నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు.. ఇక్కటి ఒక్కటి గుర్తుంచుకోవాలి. నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు. దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద జ్యూస్‌తో అధిక బరువుకు చెక్...