సిరులెన్నో తెచ్చింది సంక్రాంతి
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:04 IST)
వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగాసిరులెన్నో తెచ్చింది మాఇల్లు నిండుగాఅందాల ముగ్గులకు రంగవల్లుల తోడుగాబంగారు ధాన్యాలు ఇల్లంతా నిండుగా...!డూడూ బసవన్నల... గంగిరెద్దులవాళ్లుకిలకిలా నవ్వులతో పాపాయిలందరూచలి చలిలో భోగి మంటల వెచ్చదనంభోగిపళ్ల స్నానంతో చిన్నారి నవ్వులు
తలారా స్నానం చక్కంగా చేసిసంక్రాంతి లక్ష్మిని చల్లంగా పిలిచిపాడిపంటలతో పసిడి భాగ్యాలతో మా ఇంట సిరులెన్నో కురిపించు తల్లీమా ఇంట నెలకొన్న మాకన్నతల్లిమమ్ములను దయజూడు మా కల్పవల్లీ...!