శిరమున రత్న కిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమర దాల్తు శ్రీహరి కృష్ణా..!
తాత్పర్యం :
ఓ దేవాధిదేవా...! నీవు తలమీద రత్నములు చెక్కిన కిరీటమును, చేతుల్లో శంఖము, చక్రము, పలురకాల అలంకారాలను.. వక్షస్థలమునందు కౌస్తుభరత్నములను ధరించటమేగాకుండా... వాటికి తోడు పతకాలను చాలా అలంకారముగా ఉండేటట్లుగా ధరించి భక్తులను కనువిందు చేస్తున్నావు కదా శ్రీకృష్ణా..! అని ఈ పద్యం యొక్క భావం.