వేకువజామున మేల్కొని
పైకి వెడలి వచ్చి ప్రాచి పని దీర్చవలెన్
లేకున్న దెల్ల వారిన
లోకులు నవ్వుదురు సభల లోన కుమారీ...!
తాత్పర్యం :
తెల్లవారు ఝామునే లేచి పాచి పనులు అన్నింటినీ పూర్తి చేసుకోకుండా... ప్రొద్దెక్కిన తరువాత లేచి పాచి పనులు చేసుకుంటుండే వారిని చూసినవారు, విన్నవారు నవ్వుకుంటారని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, ప్రొద్దెక్కేదాకా నిద్రపోతూ ఉండకుండా, తెల్లవారు ఝామునే లేచి పనులను చేసుకోవటం మంచిదని అర్థం చేసుకోవాలి.
దీనికి తగినట్లుగానే మన పెద్దలు కూడా తెల్లవారు ఝామున లేవడం, రాత్రుల్లో తొందరగా నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు కూడా...!!