Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యలేనివాడు విద్యాధికుల చెంత..!

విద్యలేనివాడు విద్యాధికుల చెంత..!
FILE
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా...!!

తాత్పర్యం :
చదువులేనివాడు పండితుల చుట్టూ తిరిగినంత మాత్రాన పండితుడు కాలేడు. హంసలున్న కొలనులో ఉన్నంత మాత్రాన కొంగలు హంసలు కాలేవు కదా..! అందుకే చదువుమీద మనస్సు లగ్నం చేయాలే తప్ప, అదేపనిగా పండితుల వెంట తిరగటంవల్ల ఏ ఫలితమూ ఉండదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu