రామాలాలీ మేఘ శ్యామా లాలీ రామా
రామరాజ్యమైన దశరథ తనయాలాలీ
ఎంత ఎత్తు ఎదిగినావో.. ఏమి చేయుదుమో రామా
అందరి కన్నుల ముందర.. నీవు ముద్దుగ తిరిగేవో రామా "రామ"
అయోధ్య నగరమంతా.. అలంకరించేమో రామా
నీవు నడిచే బాటల్లోన.. మల్లెలు చల్లేమో "రామ"
అడ్డమైన ఆటలు... ఆడి అలసిపోతివో రామా
జో కొట్టి జోలలు... పాడి నిద్దురపుచ్చేమో రామా "రామ"
బంగారు పట్టు... శాలువ పైన కప్పేమో రామా
జోకొట్టి జోలలుపాడి.. నిద్దురపుచ్చేమో రామా "రామ"