Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ విశాల విక్రమ..!

Advertiesment
బాలప్రపంచం కవితలు సౌందర్యం శ్రీరాముడు సంతోషం స్త్రీలు మేఘచ్ఛాయ కాంతి రాక్షసులు నమస్కారములు తండ్రి పద్యం
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:05 IST)
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్థ్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్భలో
ద్దామ విరామ భద్రగిరి.. దాశరథీ కరుణాపయోనిధి..!

తాత్పర్యం :
సౌందర్యాది గుణములచే ప్రజలను సంతోషింపజేయుచూ... అధిక పరాక్రమము కలిగిన పరశురాముని ఓడించిన ఓ శ్రీరామా...! ఏ సమయాల్లోనైనా పర స్త్రీలయందు ఆసక్తి లేకుండా, మేఘచ్ఛాయ కాంతిలో నొప్పారుచూ, కాకుత్సవంశమునకు చంద్రుని వంటివాడవై, రాక్షసులను సంహరించుచున్న రామా..! నీకు శతకోటి నమస్కారములు తండ్రీ..! అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu