రాగల భాగ్యము వచ్చిన దాగుడువక దానమీక దాచిన ఫలితముల్ భోగాలంబున బోవును మాగిన పండూడి పడిన మాడ్కిని సుమతీ..!
తాత్పర్యం : ఎవరికీ అందకుండా చెట్టుమీదే బాగా మాగిన పండు ఏదో ఒక రోజున రాలిపోయి నేలపాలవుతుంది. అలాగే.. మన చేతికి వచ్చిన ధనాన్ని కొంత అనుభవించి మిగిలింది దానం చేయాలి. లేకపోతే ధనమంతా దాచుకోవాలని చూస్తే, చివరికి ఆ ధనం.. పండులాగా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. అందుకే అదనంగా సంపాదించిన ధనాన్ని ఇతరులకు పంచటంలోనే ప్రయోజనం ఉంటుందని ఈ పద్యం యొక్క భావం.