అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
పాడగా, పాడగా గొంతు కోయిల గానం లాగా వినసొంపుగా మారుతుందని, తినేకొద్దీ వేపాకు కూడా తియ్యగా మారుతుందని... కష్టపడి పనిచేస్తే... తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారని ఈ పద్యం యొక్క భావం.