Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముద్దుగారే యశోద ముంగిట..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ముద్దు యశోద ముత్యం మహిమ దేవకీ సుతుడు కంసుడు వజ్రము చిన్ని కృష్ణుడు రతికేళి రుక్మిణి
, మంగళవారం, 11 నవంబరు 2008 (12:31 IST)
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు "ముద్దుగారే"

పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడూ "ముద్దుగారే"

రతికేళి రుక్మిణికి తంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శుంఖు చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు "ముద్దుగారే"

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వెంకటాద్రి యింద్రనీలము
పాలజనిధిలోన బాయని దివ్య రత్నము
బాలుని వలె దిరిగీ బద్మనాభుడు "ముద్దుగారే"

Share this Story:

Follow Webdunia telugu