పిన్నల పెద్దలయెడగడు
మన్ననచే మెలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నిన్నియెడల నెన్నబడుదువన్న కుమారా...!
తాత్పర్యం :
కుమారా...! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినప్పుడు మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడిచే మార్గములలో నీవు నడువుము. అలా నీవు ప్రవర్తించినప్పుడే లోకమంతటా ప్రఖ్యాతి చెందగలవు. అందరూ నిన్ను గొప్పవాడివి, మంచివాడివి అని ప్రశంసిస్తారని ఈ పద్యం యొక్క భావం.