మర్మమెరుగకలేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖమొందుచుండ్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!
తాత్పర్యం :
అద్దాల గదిలో ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని తానే చూసి కలతచెంది ఏ విధంగా బాధపడుతుందో... అలాగే మూఢ నమ్మకాలు కలిగిన ప్రజలు ఆత్మతత్త్వం తెలుసుకోలేక, విభిన్న మతాలను కల్పించి, మతమౌఢ్యంలో చిక్కుకున్నారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ, దుఃఖంతో కాలం గడుపుతున్నారు. నిజానికి పరబ్రహ్మం ఒక్కటే అని వారు గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారని ఈ పద్యం యొక్క భావం.