Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మము రక్షించు భద్రాద్రి శ్రీరామా...!

Advertiesment
బాలప్రపంచం కవితలు శ్రీరాముడు భద్రాద్రి విరజానది గౌతమి సీతమ్మ మహా విష్ణువు వైకుంఠం భక్తులు పద్యం భావం
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:06 IST)
శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిథీ...!

తాత్పర్యం :
దశరథరామా..! నీవు పరమ పదమునందు రాజిల్లుచున్న లక్ష్మీదేవిని ఇచట సీతగా జేసుకుని, అందలి పరివారమెల్ల వీరవైష్ణవ జనులుగా వచ్చి స్తుతించుచుండగా, అచట విరజానది ఇచ్చట గోదావరీగా ప్రవహించగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రాద్రిగా రాణింపగా, వేంచేసియున్న నీ భక్తులను ఉద్ధరించుచున్న శ్రీ మహావిష్ణుండవే కానీ మరియొక మూర్తివి కానే కావు కదా... మము రక్షింపుము భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి.. అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu