భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతుజూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!
తాత్పర్యం :
ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతిని తెలుసుకోలేక... ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు ఏదీ తనవెంట రాదని తెలిసి కూడా దాన గుణం లేని లోభివాడిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయేవాడిని చూసి మృత్యువు నవ్వుతుందని ఈ పద్యం యొక్క భావం.