ప్రియములేని విందు పిండి వంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెరుగని ఈవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
ప్రేమలేని అన్న సంతర్పణములో పిండివంటలు పెట్టినా అవి వ్యర్థమే. అనర్హుడికి దానం ఇచ్చిన, అంటే... అపాత్రదానం చేసినందువలన బంగారము వన్నె తగ్గిపోతుంది. ఈ విధంగానే దేవుడిపై నమ్మకం లేనప్పుడు... ఎన్నో రకాల పూలతో పూజ చేసినప్పటికీ ఉపయోగం లేదని, అలాంటి పూజ వ్యర్థమేననీ ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.