బ్రహ్మగడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము "బ్రహ్మ"
చెలగి వసుధ గొలిచిన దీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము "బ్రహ్మ"
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమయోగులకు పరిపరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము "బ్రహ్మ"