Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుజ్జిమేక ఏడకెళ్లింది..?

Advertiesment
బాలప్రపంచం కవితలు బుజ్జిమేక రాణి తోట మేత పూల చెట్లు సొగసు మేత తోటమాలి తుర్రు
, బుధవారం, 29 అక్టోబరు 2008 (13:13 IST)
FileFILE
బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి?
రాణిగారి తోటలోన మేతకెళ్తిని..!

రాణిగారి తోటలోన ఏమి చేస్తివి?
రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని...!

పూల చెట్ల సొగసు చూసి ఊరకుంటివా..?
ఊరకొనక పూల చెట్ల మేసివస్తిని...!

మేసి వస్తే, తోటమాలి ఏమి చేసెను?
తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని...!!!

Share this Story:

Follow Webdunia telugu