సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ.
తాత్పర్యం :
ఎక్కువగా హాస్యమాడితే విరోధం కల్గుతుంది. లెక్కలెని సౌఖ్యాలను అనుభవించేవారు ఆ తరువాత పెద్ద పెద్ద కష్టాలను పొందుతారు. బాగా ఎక్కువగా, ఏపుగా పెరగేది విరిగిపోతుంది. ధరలు బాగా తగ్గుతున్నాయంటే, పెరిగేందుకేనని... ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతకకారుడు.