నాకు చాలా గిఫ్ట్‌లు వచ్చాయి
అందులో నీకు కూడా కొన్ని ఇస్తాన్లే...!
వాటితో పాటు నా హార్ట్‌ను కూడా...!!
నేను నీకు నా జిమ్ సాక్స్‌ను ఇచ్చేస్తాను
ఎప్పుడంటే అవి చిరుగులు పడినప్పుడు...
నా దగ్గరున్న పెన్నులన్నింటినీ నీకిచ్చేస్తాను
ఎప్పుడంటే... వాటిల్లో ఇంక్ అయిపోయినప్పుడు...
అంతేగాకుండా... నా దగ్గర విరిగిపోయిన
బొమ్మల్ని, ఖాళీ జామ్ బాటిల్స్‌ను...
చీకి చీకి వదిలేసిన బబుల్‌గమ్స్‌ను
అన్నింటినీ నీకిచ్చేస్తాన్లే...!!!
నా బెడ్ కింద తడిసి ముద్దయిన
పాడైన బాల్స్ అన్నింటినీ...
పని చేయని ఖాళీ బ్యాటరీలను
అన్నింటినీ నీకిచ్చేస్తాన్లే...!
కాబట్టి... నా ప్రియమైన స్నేహితుడా
నీ బర్త్‌డేను సంతోషంగా జరుపుకో...
నువ్వు నా ప్రియమిత్రుడివి...
దయచేసి... నేనిచ్చే కానుకలను,
వేటినీ... వద్దనకు... ఎందుకంటే....??
అవి నాకెందుకూ పనికిరావు......!!!