పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బట్టునా జగంబు పట్ల దెపుడు
యముని లెక్కరీతి నరుగుచు నుందురు
విశ్వదాభిరామ.. వినుర వేమా..!!
తాత్పర్యం :
ఈ భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక పోయినట్లయితే... చీమ తిరిగేందుకు కూడా ఖాళీ స్థలం ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారం పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా మరణించక తప్పదని ఈ పద్యం యొక్క భావం.