Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలున్ బువ్వయు పెట్టెదన్

Advertiesment
బాలప్రపంచం కవితలు పాలు బువ్వు కడుపు పాపన్న అరటిపళ్లు తల్లిదండ్రులు ప్రేమ బుజ్జగింపు భక్తులు భగవంతుడు
, సోమవారం, 29 డిశెంబరు 2008 (13:00 IST)
పాలున్ బువ్వయు పెట్టెదన్ కడుపారా పాపన్న, రాయన్ను లే
లే లెమ్మన్న, అరటి పండ్లుకొనితే, లేకున్న నే నొల్ల, నం
టే లాలింపరె తల్లిదండ్రు లపుడట్లే తెచ్చి? వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులన్ కడుపారా శ్రీకాళహస్తీశ్వరా...!

తాత్పర్యం :
పాలు ఇస్తాను, అన్నం పెడతాను తిను నాయనా, రారా అని బతిమలాడితే... కాదు అరటిపళ్లు తీసుకొనిరా, లేకపోతే నేను తినను అంటూ పిల్లలు మారాం చేస్తే.. తల్లిదండ్రులు అలాగే కొని తెచ్చి ప్రేమతో బుజ్జగిస్తూ తినిపిస్తారు. అలాగే భక్తులు మారాం చేసినా భగవంతుడైన నీవు ప్రేమతో మా కోర్కెలను తీరుస్తావు కదా... శ్రీకాళహస్తీశ్వరా...!! అని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu