పాలు పంచదార పాపర పండ్లలో
చాలబోసి వండ చవికి రావు
కుటిల మానవునకు గుణమేల కలుగురా
విశ్వదాభిరామ వినుర వేమా...!!
తాత్పర్యం :
వెర్రి పుచ్చకాయల్లో పాలూ చక్కెర ఎంత పోసి మరిగించినా దాని స్వాభావికమైన చేదు గుణం ఎక్కడికీ పోదు. అంటే పాలూ చక్కెరల తీపి వాటికి రాదు. అలాగే వక్రబుద్ధి కలిగిన మానవుడూ అంతే...! అతడికి ఎన్ని సద్గుణాలను నూరిపోసినా అతనిలోని కుత్సితత్వం నశించదని ఈ పద్యం యొక్క భావం.