పాలసునకైన యాపద
జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకుం
దే లగ్నిబడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ...!!
తాత్పర్యం :
తేలు నిప్పులో పడినప్పుడు, దానియందు జాలిపడి దానిని బయటకు తీయుటకు పట్టుకున్నట్లయితే కుడుతుందే, కానీ మనం చేసే మేలును అది తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖుడికి ఆపద సమయంలో అడ్డపడచూసినట్లయితే.. తిరిగీ మనకే అపకారం చేసేందుకు అతడు సిద్ధపడతాడు. కాబట్టి... మూర్ఖుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయరాదని ఈ పద్యం యొక్క భావం.