పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రీ... "పలు"
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రీ..."పలు"
రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి
జెందితివని ప్రీతితో నెరనమ్మితి తండ్రీ... "పలు"
ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రీ... "పలు"
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాదా
కరుణించు భద్రాచల వరరామదాసపోష.. "పలు"