పరహితమైన కార్య మతి భారము...!
పరహితమైన కార్య మతి భారముతోడిదియైన పూను సత్పురుషుడులోకము ల్పొగడ, పూర్వమునం దొక రాలవర్షమున్కురియగ చొచ్చినన్ తగిసి గొబ్బున గోజన రక్షణార్థమైగిరి నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా...!!తాత్పర్యం :ప్రజలకు మంచి చేసే పని.. అది ఎంత కష్టమైనది అయినప్పటికీ మంచివాడు దాన్ని చేసేందుకు పూనుకుంటాడు. పూర్వకాలంలో రాళ్ల వర్షం కురిసినప్పుడు పశువులను, వారి రక్షకులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండనే చేతితో ఎత్తుకుని గొడుగులాగా పట్టాడనని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి.. ప్రజలకు మంచి చేసే ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకూడదు.