Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదిచిలకల్లో ఉండేవెన్ని...!

Advertiesment
బాలప్రపంచం కవితలు పది చిలకలు పాట తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఏడుపు అయిదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా
, గురువారం, 11 డిశెంబరు 2008 (11:44 IST)
పది చిలకలు పాడుతుండగా...
పాడలేక ఒకటిపోతె ఇంకా తొమ్మిది

తొమ్మిది చిలకలు తూగుచుండగా...
తూగలేక ఒకటిపోతె ఇంకా ఎనిమిది

ఎనిమిది చిలకలు ఎగురుతుండగా...
ఎగరలేక ఒకటిపోతె ఇంకా ఏడు

ఏదు చిలకలు ఏడ్చుచుండగా...
ఏడ్చలేక ఒకటిపోతె ఇంకా ఆరు

ఆరు చిలకలు ఆడుచుండగా...
ఆడలేక ఒకటిపోతె ఇంకా అయిదు

ఐదు చిలకలు అరచు చుండగా...
అరచలేక ఒకటిపోతె ఇంకా నాలుగు

నాలుగు చిలకలు నవ్వుతుండగా...
నవ్వలేక ఒకటి పోతె ఇంకా మూడు

మూడు చిలకలు మూల్గుతుండగా...
మూల్గలేక ఒకటిపోతె ఇంకా రెండు

రెండు చిలకలు రేగుచుండగా...
రేగలేక ఒకటిపోతె ఇంకా ఒక్కటి

ఒక్క చిలుక వంచుచుండగా...
వంచలేక ఒకటిపోతె ఇంకా సున్నా..!

Share this Story:

Follow Webdunia telugu