పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి...!
పట్టితి భట్టరార్యగురు పాదములమ్మెయి నూర్థ్వపుండ్రముల్పెట్టితి మంత్రరాజ మొడిబెట్టితి నయ్యమకింకరాలికింగట్టితి బొమ్మ మీ చరణ కంజములందు దలంపు పెట్టిబోదట్టితి బాప పుంజముల దాశరథీ.. కరుణాపయోనిథీ..!తాత్పర్యం :"
భట్టరార్యులను, గురువుల పాదములను బట్టి.. నీ చిహ్నమగు నామమును నుదుట ధరించితిని. రామనామ మంత్రమును సాధించితిని. యమభటులనైనా పొమ్మంటిని. నీ పాదములపై తలపు పెట్టి పాపములను పోగొట్టుకుంటిని. ఇంతకంటే నేనేమియునూ చేయలేదు శ్రీరామా..! నన్ను రక్షింపుమ"ని ఈ పద్యం యొక్క భావం.