Publish Date: Fri, 22 Aug 2008 (13:14 IST)
Updated Date: Fri, 22 Aug 2008 (12:31 IST)
పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినుర వేమా..!
తాత్పర్యం :
శివుడి ఐదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని ఐదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి అని భావం.