Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేరనన్నవాడె నేర్పరి మహిలోన...!

Advertiesment
బాలప్రపంచం
నేరనన్నవాడె నేర్పరి మహిలోన
నేర్తునన్నవాడు నిందజెందు
ఊరకున్నవాడె యుత్తమ యోగిరా
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!

తాత్పర్యం :
తెలివిగలవాడు తనకేమియును తెలియదు అని నిదానంగా మాట్లాడుతాడు. అదే తెలియును అన్నచో వాదించెదరు, అపకీర్తి రావచ్చును. కాబట్టి తెలివిగలవాడు రుషిలాగా మౌనంగా ఉంటాడు. తెలివి తక్కువవాడు అన్నియు తనకు తెలిసినట్లు నటిస్తూ చివరకు అపనిందల పాలవుతాడు. కాబట్టి... తెలివి కలిగినవారెవ్వరూ అతిగా, అనవసరంగా మాట్లాడరని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu