నీళ్లమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు..!
నీళ్లమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకుబయట మూరెడైన పారలేదునెలవు దప్పుచోట నేర్పరి కొరగాడువిశ్వదాభిరామ వినుర వేమా..!తాత్పర్యం :నీటిమీద ఓడ ఎంతో వేగంగా దూసుకుపోతుంది. అదే నీటి బయట అయితే అది మూరెడు దూరం కూడా ముందుకెళ్లలేదు. అలాగే.. పరిస్థితులు అనుకూలంగా లేనిచోట మనలో ఎంత నేర్పరితనం ఉన్నప్పటికీ ఏమీ చేయలేము. ఏదైనా సాధించేందుకు మనలో ఆ సామర్థ్యం ఉండాల్సిందే. అయితే దానికితోడు అందుకు పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని ఈ పద్యం యొక్క సందేశం.