Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు...!

నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు...!
FILE
నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటి జగతి లేదు పరము లేదు
మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
మూర్ఖుడి ఆలోచనలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. అతడు ఈరోజు ఓ మాట చెప్పి, రేపు ఇంకోమాట చెబుతుంటాడు. నిన్నటి మాటకు ఈ రోజు మాటకు ఎక్కడా పొంతన ఉండదు. అతని మాటలు నీటి మీది రాతల్లాంటివి. అందుకే అతని మాటలకు లోకంలో విలువ ఉండదు. అతడు ఎంత గొప్పగా మాట్లాడినా ఎవరూ నమ్మరు. ఎవరూ నమ్మని మనిషి లోకం బ్రతకటం కష్టం. అందుకే ఏదైనా చెప్పడానికి ముందే బాగా ఆలోచించాలి. ఒకసారి చెప్పిన తరువాత ఆ మాటకు కట్టుబడి ఉండాలనేదే ఈ పద్యంలోని సందేశం.

Share this Story:

Follow Webdunia telugu