నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటు పద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ...!
తాత్పర్యం :
నిజమైన మంచి నీలము ఒక్కటి ఉన్నా చాలు కదా...! అంతేగానీ ఊరికే మెరిసెడి గాజురాళ్ళు తట్టెడు ఉన్నప్పటికీ వ్యర్థమే కదా..! అలాగే అనేక రసహీన పద్యములు వినేకంటే ఒక్క చాటు పద్యము విన్నా చాలును అని ఈ పద్యం యొక్క భావం.