నగుమోము గనలేని నా జాలి దెలిసి
నన్ను బ్రోవగ రాద.. శ్రీ రఘువర.. నీ
నగరాజధర.. నీదు పరివారు లెల్ల..
ఒగి బోధన జేసెడువారలు గారె
ఇటు లుండదురే నీ.. "నగు"
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడే
గగనాని కిలకు బహుదూరం బనినాడో
జగమేలేడు పరమాత్మ
యెవరితో మెరలిడుదు
వగ చూపకు తాళను న న్నేలుకోరా.. త్యాగరాజనుత "నగు"