శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ...!
తాత్పర్యం :
సంపదలను ఇచ్చేవాడవు, మునులచే పూజింపబడేవాడవు, సకల కీర్తిమంతుడవు, అన్ని భూతాలను పరిపాలించేవాడవు, దుఃఖాలను పోగొట్టేవాడవు, క్షత్రియ కులము అనే సముద్రానికి చంద్రుడవు, నాట్యము గానము వేడుకగా గలవాడవు అయిన ఓ భద్రాచల శ్రీరామా...! అంటూ శ్రీరామచంద్రుని కీర్తించాడు భక్త రామదాసు.