తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం :
కన్న తల్లిదండ్రుల మీద దయా దాక్షిణ్యాలు చూపలేని కొడుకు పుట్టినా ఒకటే, చనిపోయినా ఒకటే...! పుట్టలో చెదలు పుట్టడం, చనిపోయినట్లుగానే తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకుల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి కొడుకులు పుట్టడం వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.