పొట్టేలు కన్నతల్లి గొర్రే గొర్రే
దున్నపోతు కన్నతల్లి బర్రే బర్రే
ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే
మిరపకాయ తింటే ఒర్రే ఒర్రే
కాకిరెట్ట బట్టమీద కర్రే కర్రే
బురదలోన కాలేస్తే పుర్రే పుర్రే
ముందుపళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే
తొర్రినోట్లో అంబలేస్తే జుర్రే జుర్రే...!!