తమలము వేయని నోరును
విమతులతో జెలిమి జేసి వెతడు తెలివిన్
గమలములు లేని కొలనుకును
హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ..!
తాత్పర్యం :
సృష్టిలో మనిషి కొన్ని పనులను ఆచరించక పోవడం వల్ల అల్పుడుగా అనిపిస్తాడని పూర్వీకులు భావించేవారు. అలాంటి మనిషి ఎలా ఉంటాడంటే... తాంబూలము వేయని నోరులాగా, తామర పువ్వును లేని చెరువులా, చంద్రుడు లేని రాత్రిలాగా ఉంటాడని ఈ పద్యం యొక్క భావం.