తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జరులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని ఈ పద్యం యొక్క భావం.