ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ..!
తాత్పర్యం :
ఎప్పుడు కూడ తన తప్పులను వెదికే అధికారిని కింది ఉద్యోగి అభిమానించకూడదు. తనను చంపటానికి ప్రయత్నించే పాము పడగ నీడలో కప్ప నిలబడేందుకు ప్రయత్నించకూడదు. ఈ రెండుకార్యములు ఎలాంటివారికైనా కష్టాన్ని కలిగిస్తాయని ఈ పద్యం యొక్క భావం.