తాత్పర్యం : ఆలస్యాన్ని సహించలేనివారు, శ్రమను భరించలేనివారు ఊరికే ఆందోళనపడి సాధించేదేమీ ఉండదు. ప్రతి మనిషి ఆలస్యాన్ని సహించి, ఎంతటి శ్రమనైనా భరించగలిగే నిబ్బరాన్ని పెంచుకోవాలి. ఆ స్థితిలో అప్పటిదాకా అసాధ్యంగా ఉన్న పనులు కూడా సాధ్యమైపోతాయి. ఏ విజయాన్ని సాధించాలన్నా సహనం, ఓపిక అనే రెండు సుగుణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఈ పద్యం యొక్క భావం.